YS Jagan: జగన్ 2.0 గురించి లోకల్ టాక్ ఇదే….వారికి ప్రాధాన్యత ఇస్తారా?

Y.S Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో 151 స్థానాలలో సింగిల్ గా పోటీ చేసి విజయం సాధించారు అయితే గత ఎన్నికలలో మాత్రం ఈయన కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇలా జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు మాత్రమే రావడంతో ఎంతో మంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఇలా ఈ ఎన్నికలలో 11 రావడానికి కారణం కూడా లేకపోలేదు జగన్ గెలిచిన తర్వాత కేవలం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలో వాలంటీర్లు మాత్రమే పని చేశారు.

పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలా కార్యకర్తలు ఉంటేనే ఓటర్లను స్థానికంగా బూత్ వరకు తీసుకువెళ్లి ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తారు అలాంటి కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడం వల్లే ఆయనకు 11 స్థానాలు వచ్చాయనే వాదన కూడా ఉంది. ఇలా కార్యకర్తల గురించి జగన్ పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటు జైలు పాలు అవుతున్నారు.

గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు చేసిన వారందరిపై కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఇలా కూటమి ప్రభుత్వం వైసిపి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 2.0 గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 2.0 కార్యకర్తల కోసమే పని చేస్తుందని తెలిపారు.

అయితే జగన్ 2.0 గురించి లోకల్ టాక్ ఏంటని విషయానికి వస్తే.. జగత్ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. దీనికోసం కార్యకర్తలు వచ్చే నాలుగేళ్లపాటు పార్టీ కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుంది. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ, ఇది సాధ్యం కాకపొవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా కూటమికి వ్యతిరేకంగా ఇప్పుడు పని చేస్తే అరెస్ట్ కావలసి ఉంటుంది తద్వారా ఎవరూ కూడా కూటమికి వ్యతిరేకంగా పనిచేసే సాహసం కూడా చేయలేకపోతున్నారని చెప్పాలి.