AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసినదే .కేవలం ఒక పెన్షన్ మాత్రమే చెప్పిన విధంగా అమలు చేస్తున్నారు. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేసినప్పటికీ ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలుస్తోంది. ఇకపోతే కూటమి పార్టీలు ఎన్నికలకు ముందే ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడంతో ఇప్పటికే కూటమి పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలోనే నటుడు సుమన్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ ఎన్ డి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పాలన ఎంతో అద్భుతంగా ఉందని ఎన్ డి ఏ పాలనతో ప్రజలకు కూడా సంతోషంగా ఉన్నారని ఈయన తెలిపారు.
ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కూడా మాట్లాడారు. ఇలా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు ఒకే విధంగా అమలు చేయాలి అంటే అది ఎవరికి సాధ్యం కాదు అందుకే ఒక్కొక్క పథకాన్ని ఒక్కోసారి కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది అంటూ నటుడు సుమన్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈయన మాట్లాడారు. ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారని వెల్లడించారు.
ఇక ఇటీవల తిరుమలలో భక్తులకు ఎంతో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయని టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు స్వామివారి దర్శనం కోసం గంటలు తరబడి ఎదురు చూడాల్సి ఉండేది కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు తీసుకునే నిర్ణయాలు సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి అంటూ ఎన్ డి ఏ ప్రభుత్వం పై సుమన్ ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.