టీ, సిగరెట్ తాగే అలవాటు ఉందా.. ఈ చిట్కాలు పాటించకపోతే ఇన్ని సమస్యలా?

మనలో చాలామంది టీ, సిగరెట్లను ఎంతగానో ఇష్టపడతారు. అయితే టీ, సిగరెట్ వల్ల తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా దీర్ఘకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. టీ విషయంలో పరిమితి దాటితే ఇబ్బందులు మొదలవుతాయని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. టీలో కెఫీన్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల పేగుల్లో కదలికలు మొదలవుతాయి. అతిగా టీ తాగితే మాత్రం డీహైడ్రేషన్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ విధంగా జరగడం వల్ల పేగుల్లోని వ్యర్థాలు మరింతగా గట్టిపడి మలబద్ధకం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కెఫీన్ డైయూరెటిక్‌గా పనిచేస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. మూత్రం ద్వారా నీరు కోల్పోతే ఆ ప్రభావం నేరుగా జీర్ణవ్యవస్థపై పడే అవకాశాలు ఉంటాయి. టీలో ఉండే పాల వల్ల లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ ఉన్న వారు కూడా మరింత ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ధూమపానం కూడా జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలుంటాయి.

నికోటిన్ అనే రసాయనం నాడీ వ్యవస్థను ప్రేరేపించి పేగుల్లో కదలికలను పెంచుతుందని చెప్పవచ్చు. నికోటిన్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నికోటిన్ కారణంగా పేగులకు రక్తప్రసరణ కూడా తగ్గి వాటి పనితీరు మందగిస్తుంది. ధూమపానంతో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా వస్తుందని వైద్యులు వెల్లడిస్తుండటం గమనార్హం.

ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. టీ, సిగరెట్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని చెప్పవచ్చు. టీ, సిగరెట్ ఆరోగ్యానికి కలిగించే నష్టం మాత్రం అంతాఇంతా కాదు.