Rajendra Prasad: పొరపాటు జరిగింది క్షమించండి…క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్!

Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ ఇటీవల రాబిన్ హుడ్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రముఖ క్రికెటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ…

రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప డైలాగులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ అంటూ మాట్లాడారు అయితే ప్రముఖ క్రికెటర్ అయినటువంటి డేవిడ్ గురించి రాజేంద్రప్రసాద్ ఇలా మాట్లాడటంతో ఈయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే ఎంతోమంది రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై విమర్శలు కురిపించారు.

ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలపై రాజేంద్రప్రసాద్ స్పందించారు తాను డేవిడ్ వార్నర్ గురించి ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని తెలిపారు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు కూడా మేమంతా కూర్చొని చాలా సరదాగా మాట్లాడాము, నితిన్ , డేవిడ్ వీరందరూ కూడా నాకు బిడ్డలతో సమానం. ఐ లవ్ డేవిడ్ ఐ లవ్ డేవిడ్ క్రికెట్ డేవిడ్ లవ్స్ అవర్ ఫిలిం అంటూ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.

ఇలా తాను డేవిడ్ గురించి మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా కొన్ని పదాలు మాట్లాడాను. అయితే తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని పొరపాటున అలా అయిందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఇకపై ఇలాంటి తప్పు జరగదు అంటూ రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు అదేవిధంగా 28వ తేదీ కచ్చితంగా ప్రతి ఒక్కరు రాబిన్ హుడ్ సినిమా చూడాలని తెలిపారు.