వేపాకు నీటితో స్నానం చేస్తే కలిగే లాభాలివే.. ఆ సమస్యలన్నీ దూరం అవుతాయా?

మనలో చాలామంది వేపాకు నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. వేపాకు నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో వేప ఆకులు వేయటానికి లేదా ఆ ఆకులను నీటితో మరిగించి స్నానం చేస్తారు. వాస్తవానికి వేప ఆకులు, బెరడు, పువ్వు, కాయలు సహా చెట్టులోని అణువణువూ ఔషధ గుణాలను కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

వేపలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో పాటు శరీరానికి హానీకరమైన ప్రీ రాడికల్స్‌తో వేప పోరాడుతుందని చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో వేపాకులు తోడ్పడతాయి. వేపాకు నీటితో ముఖాన్ని కడగడం వల్ల ముఖానికి సహజ సిద్దంగా మెరుపు వస్తుంది. శరీరంలో చుండ్రును తొలగించే విషయంలో వేపాకు నీళ్లు ఉపయోగపడతాయి.

వేప ఆకులను వేడి నీటిలో కడిగి రంగు మారే వరకు వడకట్టాలి. వారానికి రెండు మూడుసార్లు వేప నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో వేప ఆకులు తోడ్పడతాయి. వేప ఆకులను సరైన విధంగా వాడటం వల్ల దీర్ఘకాలంలో లాభాలు ఉంటాయి.

వేప ఆకు నీళ్లతో స్నానం చేస్తే మొటిమల సమస్య తొలగిపోయి ముఖం మెరుస్తుందని చెప్పవచ్చు. వేప ఆకులను పేస్ట్‌లా చేసి 2 స్పూన్ల పెరుగుతో కలిపి.. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేస్తే నల్ల మచ్చలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి.