దొంగ నోట్ల విషయంలో కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

ప్రస్తుతం టెక్నాలజీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఒరిజినల్ నోట్లను తలపించేలా దొంగ నోట్లు అందుబాటులోకి వస్తున్నాయి. మార్కెట్ లో దొంగనోట్ల చలామణి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 500 డినామినేషన్ నోట్లు దొంగనోట్లు అని అనుమానం ఉంటే నోటు పరిమాణం 66 ఎంఎంజ్ 150 ఎంఎంగా ఉంటుందని చెప్పవచ్చు.

నోటు ముందు భాగంలో తెల్లని ప్రాంతాన్ని వెలుగుకు అభిముఖంగా పెడితే గాంధీజీ ఫొటోతో పాటు డినామినేషనల్ సంఖ్య అయిన 500 అని కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ నోట్ల మధ్యలో ‘భారత్’ ‘ఆర్‌బీఐ పేరుతో కలర్ షిఫ్ట్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. 500 రూపాయల నోటును తిప్పిన సమయంలో థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుందని చెప్పవచ్చు.

గ్యారంటీ క్లాజ్, ప్రామిస్ క్లాజ్‌తో గవర్నర్ సంతకం, మహాత్మా గాంధీ చిత్రపటం కుడివైపున ఆర్బీఐ చిహ్నం ఉంటే మాత్రమే ఒరిజినల్ నోటు అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ పోర్ట్రెయిట్ (4), అశోక స్తంభ చిహ్నం (11), కుడి వైపున రూ. 500 మైక్రో టెక్స్ట్‌తో రౌండ్ గుర్తింపు గుర్తు, ఎడమ, కుడి వైపున ఐదు కోణీయ బ్లీడ్ లైన్‌ల ఇంటాగ్లియో లేదా రైజ్డ్ ప్రింటింగ్ ద్వారా 500 రూపాయల నోట్లను గుర్తు పట్టవచ్చు.

నోటు వెనుకవైపున ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరంతో పాటు స్వచ్ఛ భారత్ నినాదంతో లోగో, అన్ని భాషల్లో ఉన్న భాషా ప్యానెల్ ఎర్రకోట మూలాంశంతో పాటు దేవనాగరిలో డినామినేషనల్ సంఖ్య 500 ఉంటుందని చెప్పవచ్చు. మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోటు దొంగ నోటు అని గుర్తిస్తే వెంటనే సమీపంలోని పోలీసులను సంప్రదించి ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి.