ఆ లెక్కలన్నీ కాకి లెక్కలేనా.. ఏపీ సర్వే ఫలితాలను నమ్మాల్సిన అవసరం లేదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో వచ్చే ఫలితాలు ఇవేనంటూ కొన్ని సర్వేల ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ సర్వేలన్నీ కచ్చితత్వంతో కూడిన సర్వేలేనా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండే సంస్థలను ఈ సర్వే ఫలితాలను జోరుగా ప్రచారంలోకి తెస్తుండటం గమనార్హం.

2024 ఎన్నికలకు మరో 20 నెలల సమయం మాత్రమే ఉంది. అటు టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ అభ్యర్థులు ఫిక్స్ కాలేదు. జనసేన ఏపీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తుందో లేక ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తుందో తెలియదు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఫలితాలు ఒక విధంగా ఉంటాయని ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయని పక్షంలో ఫలితాలు మరో విధంగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కొందరు ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతుంటే కొందరు ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రజలను సోమరిపోతుల్ని చేస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రాజధాని విషయంలో జగన్ సర్కార్ తీసుకునే తుది నిర్ణయం కూడా ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎన్నికల సర్వే ఫలితాలను నమ్మాల్సిన అవసరం లేదని ఎన్నికల సమయానికి ఫలితాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థికంగా బలహీనంగా ఉండటం కూడా టీడీపీకి ఒక విధంగా మైనస్ అయింది. టీడీపీ ఏపీలో సత్తా చాటాలని ఆ పార్టీ అభిమానులు ఆశిస్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2024 ఎన్నికల సమయానికి ఏపీలో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది.