Chiranjeevi: చిరంజీవిని భేటీకి రావద్దని రేవంత్ రెడ్డి చెప్పారా… ఎందుకో తెలుసా?

Chiranjeevi: ఇటీవల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలందరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. సినిమాలకు బెనిఫిట్ షోలు ఇవ్వడం అదేవిధంగా టికెట్ల రేట్లు పెంచడం గురించి ఎంతోమంది సీనియర్ హీరోలు దర్శకులు నిర్మాతలు అందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసి పలు విషయాల గురించి చర్చించారు. అయితే ఈ భేటీకి ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. అదేవిధంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా హాజరు కాలేదు.

ఇక మంచు విష్ణు హాజరు కాకపోయినప్పటికీ ఆయనకు బదులు మా సెక్రెటరీ శివ బాలాజీ హాజరయ్యారు. ఇక చిరంజీవి రాకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చిరంజీవి హాజరు కాకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి అని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి స్వయంగా చిరంజీవిని ఈ భేటీకి రావద్దని చెప్పారట అలా వద్దని చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన సంపాదించే దానిలో కొంత భాగం ప్రజా సేవకే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంక్ అంటూ ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. అదేవిధంగా కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం ఈయన ముందుకు వచ్చి కార్మికులందరికీ వాక్సిన్లు వేయించడం సరుకులు పంపిణీ చేయడం ఆక్సిజన్ సిలిండర్లను అందించడం వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని పిలిచి ఇలా చేయని,అలా చేయి అంటూ సలహాలు ఇవ్వడం ఇష్టం లేనటువంటి రేవంత్ చిరంజీవిని స్వయంగా ఈ భేటీకి రావద్దని చెప్పారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈయన సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల కూడా రాలేకపోయారని మరో వాదన కూడా వినపడుతుంది.