తమిళ స్టార్ హీరో అజిత్ విదాముయార్చి సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. తమిళనాట ఆయన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. తమిళంలో స్టార్ హీరో హోదా అందుకున్న ఈ నటుడు తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. అయితే అజిత్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న బ్యాట్మెంటన్ స్టార్ పివి సింధు పెళ్లికి కుటుంబ సమేతంగా హాజరయ్యాడు.
బ్లాక్ కోట్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించిన అజిత్ ఈ ఈవెంట్ లో తన డాన్స్ తో అదరగొట్టాడు. పుష్ప ది రేస్ సినిమాలో అల్లు అర్జున్ సమంతతో కలిసి డాన్స్ చేసిన ఊ అంటావా మామా ఊహు అంటావా అనే సాంగ్ కి అజిత్ తనదైన స్టైల్ లో మాస్ స్టెప్స్ వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ డాన్స్ చేసింది అజిత్ కాదు అని అజిత్ పోలికలతో ఉన్న వేరే వ్యక్తి అని కొందరు వాదిస్తున్నారు.
అయితే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నటుడు అజిత్‌లా కనిపిస్తుండడంతో నటుడు అజిత్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ వీడియోలో ఉన్నది అజిత్ అవునా కాదా తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న విధాముయార్చి సినిమా కి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది వీరిద్దరూ ఇంతకుముందే జీ, కిరీడం, మంకధా మరియు యెన్నై అరిందాల్ లో కలిసి నటించారు. మళ్లీ ఐదవ సారి జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఆరవ్,నిఖిల్ నాయర్ దాసరధి మరియు గణేష్ లతో పాటు అర్జున్, రెజీనా కసాండ్రా కూడా నటిస్తున్నారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఎడిటర్ గా ఎన్ బి శ్రీకాంత్ పనిచేస్తున్నారు.
#Ajith sir #Pushpa song 🥵🥵🥵🥵🥵🥵🥵🥵🥵💥💥💥💥 @alluarjun #Pushpa2 pic.twitter.com/xycjq3z6ge
— Phani Bunny Fan🪓 (@SaiphaniSaisri1) December 25, 2024