Bigg Boss Adi Reddy: తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూ చెప్తూ బాగా ఫేమస్ అయ్యాడు ఆదిరెడ్డి. అదే ఊపుతో బిగ్ బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ తో ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు. తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వచ్చారు ఆదిరెడ్డి.
అయితే మొదట్లో చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సినిమాలు, క్రికెట్, సోషల్ ఇన్సిడెంట్స్ పై వీడియోలు చేసిన ఆది ఆ తర్వాత రియాలిటీ షో బిగ్‌బాస్ పై వీడియోలు చేయడంతో అవి వైరల్ గా మారాయి. దీంతో బిగ్ బాస్ 6వ సీజన్ లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డి ఫైనల్ వరకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆ పేరుతో బాగానే పాపులారిటీ, డబ్బు సంపాదించుకున్నాడు. పలు టీవీ షోలలో కనిపిస్తూ,ఒక సెలూన్ కూడా ఓపెన్ చేసి బిజినెస్ చేసుకుంటూనే ప్రతి సీజన్ బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూనే ఉన్నాడు ఆదిరెడ్డి. అయితే తాజాగా ఆదిరెడ్డి మళ్ళీ స్టూడెంట్ గా మారాడు.
ఈ విషయాన్ని ఆదిరెడ్డి అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తను లా చదవబోతున్నట్టు, లాయర్ అవ్వడం తన డ్రీం అన్నట్టు, ఆల్రెడీ లా కాలేజీలో చేరినట్టు తెలిపాడు ఆదిరెడ్డి. నెల్లూరు లోని వీఆర్ లా కాలేజీలో ఆదిరెడ్డి చేరినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆదిరెడ్డిని అభినందిస్తున్నారు. మీ సక్సెస్ ని మీరు రీచ్ కావాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. ఇకపోతే ఇటీవలే ఆదిరెడ్డి తన ఊరిలో పెద్దగా ఇల్లు కట్టుకున్న విషయం తెలిసిందే.