Bollywood: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి కళ్ళు ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీపై ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలో వైపే కన్నులు ఎక్కువగా ఉన్నాయి. గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సత్తాని చాటుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి ఇతర భాష నటీ నటులు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లో చిన్న ఛాన్స్ వచ్చినా నటించేందుకు సిద్ధమంటున్నారు పలువురు హీరోయిన్స్. కానీ అంతకు మించి భారీగా పారితోషికం సైతం వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టార్ హీరోయిన్ క్రేజ్ కూడా మామూలుగా లేదు.
ఆ హీరోయిన్ క్రేజ్ ఎలా ఉందంటే కేవలం 10 రోజుల్లో షూటింగ్ కోసం ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకుందట. మొదటి సినిమాతోనే అ ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదండోయ్ అలియా భట్. తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ అందుకున్న వారిలో అలియా భట్ కూడా ఒకరు. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలియా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది అలియా. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అదే ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.
ఇందులో సీత పాత్రలో అద్భుతంగా నటించింది అలియా. అయితే అలియా భట్ పాత్ర నిడివి ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ బాగానే గుర్తింపు దక్కింది. అయితే ఈ సినిమాకు కేవలం పది రోజులు మాత్రమే వర్క్ చేసిందట. అయితే పది రోజులు షూటింగ్ చేసినందుకు ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం తీసుకుందట. ఈ సినిమాలో తనదైన నటనతో మెప్పించిన అలియా మరో తెలుగు మూవీ చేయలేదు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది. గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం భారీగా పారితోషికం అందుకుంటూ దూసుకుపోతోంది అలియా. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వామ్మో ఆలియా క్రేజ్ మామూలుగా లేదుగా. పది రోజుల షూటింగు కు 9 కోట్ల రూపాయల అంటూ షాక్ అవుతున్నారు.