AP: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం.. సెటైర్లు వేసిన షర్మిల?

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాలలో భాగంగా కూటమి నేతలు పెద్ద ఎత్తున హామీలను ఇచ్చారు సూపర్ సిక్స్ అంటూ సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ తలుచుకుంటేనే భయం వేస్తుందని సూపర్ సిక్స్ అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ ప్రజలను మోసం చేశారు.

ఇలా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి తాము అధికారంలోకి రాగానే తెలంగాణ కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విధంగా ఏపీలో కూడా మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును కల్పిస్తామని తెలిపారు.

ఇక అధికారంలోకి వచ్చి కూడా ఆరు నెలలు పూర్తి అయినప్పటికీ ఇంకా ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ హామీ గురించి ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ..మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఏపీలో ఉచిత బస్సు సర్వీసు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇలా మంత్రుల కమిటీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై షర్మిల సెటైర్లు వేశారు. మహిళకు ఉచిత బస్సు పథకం అమలుపై టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కాలయాపన తప్ప ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని.. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటేశారని మండిపడ్డారు. ఇంత చిన్న హామీని కూడా నెరవేర్చడానికి ఎందుకు అంత జాప్యం చేస్తున్నారని ఈమె మండిపడ్డారు.తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా? మరి ఏపీలో ఎందుకు సాధ్యం కావడం లేదు అంటూ ఈమె వరసగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.