YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజులకు పులివెందుల పర్యటనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా గత నాలుగు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్న జగన్ బుధవారం లింగాల మండలం తాతిరెడ్డి పల్లిలో కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనడంతో పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు జననేతకు నీరాజనం పలికారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కోదండ రామాలయానికి 34 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. అయితే ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఈ ఆలయ ప్రతిష్ట రోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆలయ అధికారులు ఈయనకు ప్రత్యేకంగా స్వాగతం పలకడమే కాకుండా ఈ పూజ కార్యక్రమాలలో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొని సందడి చేశారు.ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా పులివెందుల పర్యటనలో ఉన్నటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పెద్ద ఎత్తున ప్రజలు వెళ్లి వారి సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నారు.