Devi Nagavalli: టీవీ9 రిపోర్టర్ గా న్యూస్ రీడర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దేవి నాగవల్లి ఒకరు. ఈమె ఏ విషయం మాట్లాడినా ఎదుటివారిని ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ అదేవిధంగా మాట్లాడుతూ ఉంటారు దీంతో పలు సందర్భాలలో వివాదాలలో కూడా నిలుస్తూ ఉన్నారు. ఇక న్యూస్ రిపోర్టర్ గా ఎంత మంచి సక్సెస్ అందుకున్న దేవి నాగవల్లి బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఈమె అనంతరం బయటకు వచ్చారు..
ఇలా దేవి నాగవల్లి మీడియా రంగంలో ఎంతో మంచి అనుభవం సాధించారు. అయితే తాజాగా ఈమె టీవీ9 కు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తుంది. రిపోర్టర్ గానే ఈమె తప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తోటి రిపోర్టర్స్ అందరూ కూడా ఈమెకు ఘనంగా ఫేర్వెల్ ఇచ్చారు తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదిక షేర్ చేశారు..
ఈ ఫోటోలలో రజనీకాంత్, సత్య, శిరీష, దీప్తి, ప్రణీత ఇంకా చాలామంది ఉన్నారు. టీవీ9 టీమ్ తెప్పించిన కేక్ ను దేవి కట్ చేసింది. ఆల్ ది బెస్ట్ దేవీ నాగవల్లి…. ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అని ఆ కేక్ మీద రాసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా మీడియా రంగానికి గుడ్ బై చెప్పిన ఈమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు.
మీడియాలోనూ జీరో నుంచి మొదలుపెట్టి ఇప్పుడు గొప్ప స్థాయికి వచ్చానని, తాను అడుగుపెట్టబోయే మరో రంగంలో కూడా జీరో స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటానని తెలిపారు. అప్పటివరకు తాను మీడియాకు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటానని ఈ సందర్భంగా దేవి నాగవల్లి తెలియజేశారు. ఇక ఈమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు స్పష్టం అవుతుంది. మరి తన తదుపరి ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.