Pawan kalyan: తెలుగు ప్రేక్షకులకు డిప్యూటీ సీఎం, టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు రాజకీయాలలో కూడా ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటూ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారు. ఒకవైపు సినిమాలు ఒకవైపు రాజకీయాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇకపోతే ఇటీవలే పవన్ కళ్యాణ్ తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడిన విషయం తెలిసిందే. ఒక్కొక్కటిగా సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవర్ స్టార్ నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా చాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు మూవీ మేకర్స్. అదేమిటంటే కొత్త ఏడాది సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందట. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం గ్లీంప్స్, టీజర్లు మాత్రమే విడుదల అయ్యాయి. పలు యాక్షన్ సీన్లతో అభిమానులను అలరించారు పవన్. ఇక ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారట. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ పాట పవన్ కళ్యాణ్ వాయిస్ తో ఉండబోతోందట. పాట కూడా ఆయనే పడతాడని అంటున్నారు.
దీంతో ఈ వార్త తెలిసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడే సెలబ్రేషన్ షురూ చేస్తున్నారు. క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డియోల్ ఔరంగాజేబ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇది. పవన్ నుంచి వస్తోన్న మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీనికితోడు హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కొహినూర్ వజ్రం కోసం సాగే పోరాటం ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు అభిమానులకు ఎదురుచూపులు ఫలించాయి.