Pawan Kalyan: సినిమా వేరు.. నిజ జీవితం వేరు.. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గుర్తిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అక్కడ రోడ్లను పరిశీలిస్తూ ఈయన పాదయాత్ర చేస్తూ ఉండగా ఎంతో మంది అభిమానులు చుట్టుముడుతో పవన్ కళ్యాణ్ పనులకు ఆటంకం కలిగిస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఆయన పార్వతీపురం జిల్లాలోని బాగుజోల గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అయితే అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని సినిమాల గురించి అప్డేట్ అడగడమే కాకుండా మీసం తిప్పాలని తొడ కొట్టాలి అంటూ కేకలు వేస్తున్నారు ఇలాంటి కేకలు వేయటం వల్ల పవన్ అసహనం వ్యక్తం చేశారు.

నేను ఇక్కడ డిప్యూటీ సీఎంగా ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడం కోసం వచ్చాను ఇలా మీరు నా పనులకు అడ్డుపడితే మీ సమస్యలు తీరవు సినిమాలలో మాదిరిగా మీసం తిప్పు అంటే నేను మీసం తిప్పితే ఇక్కడ రోడ్లు పడవు తొడకొడితే మీ సమస్యలు తీరిపోవు ఇక్కడ సమస్యలు ఏంటి అనేది నేను పరిశీలించి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తేనే మీ సమస్యలు తీరుతాయి దయచేసి నా పనిని నన్ను చేసుకొనివ్వండి అంటూ ఈయన సుతి మెత్తగా అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇలాంటి పార్టీ మీటింగ్ నిర్వహించిన అభిమానులు ఆయన చెప్పేది వినకుండా కేవలం తన సినిమాల అప్డేట్స్ అడగడం పట్ల కొంతమంది స్పందిస్తూ పవన్ డిప్యూటీ సీఎం అయినా ఆయనని డిప్యూటీ సీఎం అవుతారు ఎవరు చూడటం లేదని ఒక హీరోగా మాత్రమే చూస్తున్నారని అందుకే ఎక్కడికి వెళ్ళినా సినిమాల గురించి మాత్రమే అడుగుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.