Anshu Malika: గ్లోబల్ ఎంటర్‌ ప్రెన్యూర్ అవార్డు సొంతం చేసుకున్న రోజా డాటర్ అన్షు… గ్రేట్ అంటూ?

Anshu Malika: సినీనటి మాజీ వైకాపా మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అదే విధంగా రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. గతంలో వైకాపా పార్టీ హయామంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా రోజా వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె తమిళ దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ దంపతులకు ఒక కుమారుడు కుమార్తె రోజా కుమార్తె అన్షు మాలిక గురించి అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈమె విదేశాలలో ఉన్నత చదువులను చదువుతున్నారు.ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క సాఫ్ట్వేర్ రంగంలో కీలక మార్పులు తెస్తున్న ఏఐ విభాగంలో కోడింగ్, డెవలప్మెంట్ వంటి విభాగాల్లో పనిచేస్తోంది. అయితే 7 ఏళ్ళ వయసులోనే కోడింగ్ రాయడం ప్రారంభించిన అన్షు, 17 సంవత్సరాల వయస్సులో ‘ఫేస్ రికగ్నిషన్ బాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్’ అనే అంశంపై రిసెర్చ్ ఆర్టికల్ రాసింది.

ఇలా ఇంత చిన్న వయసులోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అన్షు మాలిక తాజాగా మరో అవార్డు సొంతం చేసుకున్నారు. తాజాగా సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో అన్షు మాలిక ఈ అవార్డును అందుకుంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా రోజా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను రోజా షేర్ చేస్తూ సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు అందుకున్న అన్షు మాలికకి అభినందనలు. మా కృషి పట్టుదల ఫలించింది అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఎంతో మంది అభిమానులు రోజా కూతురికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇంత చిన్న వయసులో ఇలాంటి గొప్ప అవార్డులు అందుకోవడం నిజంగా గ్రేట్ అంటూ ఈమె సాధించిన ఘనతపై కామెంట్లు చేస్తున్నారు.