దీర్ఘాయుష్షు కోసం పాటించాల్సిన చిట్కాలివే.. ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే!

మనలో చాలామంది ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ కాలం జీవించాలని భావిస్తూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ డీ స్థాయి వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల కొంతమంది ఆస్టియోపోరోసిస్ వ్యాధి బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

రక్తంలో విటమిన్ డీ స్థాయి ఎంత ఉందో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిది. కాలేయ పనితీరును ముదింపు వేసేందుకు లివర్ ఫంక్షన్ టెస్టులు ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. వివిధ ఎంజైములు, ప్రొటీన్లు, బిలిరుబిన్ స్థాయిని చెక్ చేయడం కోసం ఈ పరీక్షలను నిర్వహిస్తారు. క్రియాటినైన్, బ్లడ్ యూరియా స్థాయిలో అధికంగా ఉంటే కిడ్నీలో ఏదో సమస్య ఉండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

అపో లిపోప్రొటీన్ బీ పరీక్ష ద్వారా గుండె సంబంధిత సమస్యల గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. రెండు మూడు నెలల్లో శరీరంలో సగటు చక్కెర స్థాయిలను అంచనా వేసేందుకు హెచ్‌బీఏ1సీ పరీక్ష అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఈ పరీక్షలను తప్పనిసరిగా చేయించుకుంటే మంచిది. ఈ పరీక్షలకు ఖర్చు ఎక్కువైనా చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఇబ్బందులు తప్పవు. బీపీ, షుగర్, థైరాయిడ్ కు సంబంధించిన పరీక్షలను సైతం ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొత్త సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.