YCP: 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్షంతో పాలన కొనసాగుతుందని వైకాపా నాయకులు ఇదివరకే ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తుందని కేవలం వైసీపీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపోతే తాజాగా వైకాపా పార్టీ ప్రధాన కార్యదర్శి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి పార్టీ లేకుండా చేయాలని కూటమి నేతలు కుట్ర పడుతున్నారని ఈయన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఎంతో మంది వైసీపీ నేతలపై కేసులు పెట్టారని ఈయన తెలిపారు. ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్ పై అక్రమంగా కేసులు నమోదు చేసే తనని జైలుకు పంపించారని తెలిపారు.
ఇక ఒక మాజీ ఎంపీ అరెస్టు అయితే తనకు విఐపి సౌకర్యాలు ఉండాల్సిందే అలాంటిది కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదని తెలిపారు. మరోవైపు పేరుని నాని దాకలు చేసిన పిటీషన్ హైకోర్టు విత్ డ్రా చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా పోలీసులు విచారణకు పిలిస్తే వెళ్లాలని కూడా కోర్టు తీర్పు ఇవ్వటాన్ని ఈయన పూర్తిగా తప్పుపట్టారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్టులు చేయటాన్ని పూర్తిగా తప్పుపట్టారు. ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైకాపా నేతలు కార్యకర్తలనే టార్గెట్ చేశారని సజ్జల మండిపడ్డారు.