వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరోయిన్ అనన్య నాగళ్ల మాటాడుతూ..అందరికీ నమస్కారం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాతో పాటు నా పాత్రకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇందులో చేసిన రోల్ మరో ఎత్తనే రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా వుంది. కొత్త ప్రయత్నం చేస్తే తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని మరోసారి ఈ సినిమాతో రుజువైయింది. మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ ఇది. చుసిన ఆడియన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటున్నారు. మన రూట్స్ తో పాటు థ్రిల్ ఇచ్చే సినిమా ఇది. ఈ హాలీడేస్ లో ఫ్యామిలీస్ తో కలసి సినిమా చూడండి. తప్పకుండా థ్రిల్ అవుతారు’ అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాని సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఒక మంచి సినిమా తీశారు, మంచి ప్రయత్నం చేశారు అని ప్రేక్షకులు చెప్పడం చాలా ఆనందం ఇచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది, చివరి 40 నిమిషాలు కట్టిపడేస్తుంది, సీట్ థ్రిల్లర్ అని ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉంది. ఇందులో ఎంటర్ టైన్మెంట్ కంటే థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందని మేము మొదటి నుండి చెప్తూ వచ్చాం. సినిమా చూసిన ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇందులో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందని చెప్పారు. మేము కూడా అదే ఊహించాము. ఈ శని, ఆదివారం కూడా ఈ సినిమాని ఇలానే సపోర్ట్ చేసి ఇంకా మంచి నెంబర్స్ మాకు ఇచ్చి ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ తో బయటికి వచ్చేలా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థాంక్యూ’అన్నారు.
నిర్మాత వెన్నపూస రమణారెడ్డి మాట్లాడుతూ.. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించానని అనుకుంటున్నాను. మేము ఊహించిన దాని కంటే రెస్పాన్స్ చాలా బెటర్ గా ఉంది. ఇలానే కొనసాగించాలని అనుకుంటున్నాను. థాంక్యూ’ అన్నారు