Actor Charith: యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ నటుడు అరెస్టు.. అసలేం జరిగిందంటే!

Actor Charith: సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకరు సినిమా సెలబ్రిటీలు జైలు పాలవుతున్నారు. మొన్నటి వరకు మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూ, అంతకుముందు జానీ మాస్టర్ ఇష్యూ, అల్లు అర్జున్ ఇష్యూ ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బుల్లితెర నటుడు అరెస్ట్ అయ్యారు. అతను మరెవరో కాదు నటుడు చరిత్ బాలప్ప. ఇతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. బెంగళూరు ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు శుక్రవారం డిసెంబర్ 27 న అతడిని అరెస్ట్ చేశారు.

తెలుగు బుల్లితెరతో పాటు పలు కన్నడ సీరియల్స్‌ లో చరిత్ నటించారు. అయితే తన ప్రియురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈ నటుడి పై ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. చరిత్ తనను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. చరిత్ తన సహచరులతో కలిసి యువతి ఉంటున్న ఇంట్లోకి చొరబడి వేధించినట్లు సమాచారం. అంతే కాకుండా యువతి నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరించినట్లు సమాచారం. చరిత్‌ పై లైంగిక వేధింపులు, దాడి, హత్య బెదిరింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడు చరిత్ బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా చరిత్ కు ఇప్పపటికే పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత కూడా అతను తన మాజీ భార్యతో గొడవ పడ్డాడు. కాగా గతంలో 2017లో ఒక ఆమెను వివాహం చేసుకున్నారు. 2022 తర్వాత వీరి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. తర్వాత కోర్టులో విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు డైవర్స్ పరిహారం కోసం నోటీసు పంపినందుకు తన మాజీ భార్యను బెదిరించినట్లు చరిత్ బాలప్ప పై సర్జాపూర్ పోలీస్ స్టేషన్‌ లో గత జూన్‌ లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతున్నందున, చరిత్ బాలప్ప ప్రస్తుతం పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. నటుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ కేసు కన్నడ సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.