Actress Saranya: ఏంటి.. ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లా.. అందంలో హీరోయిన్ లను మించి పోయారుగా!

Actress Saranya: తెలుగు ప్రేక్షకులకు నటి శరణ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్క లేదు. శరణ్య అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ రఘువరన్ బీటెక్ సినిమాలో హీరోయిన్ ధనుష్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతో భారీగా అభిమానులను సంపాదించుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది. ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది శరణ్య. అగ్ర హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన నాయకన్ సినిమాలో హీరోయిన్గా నటించింది.

కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమాయకమైన పాత్రలో నటించి అద్భుతమైన నటనను కనబరిచింది. దీంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత అమ్మగా అత్తగా కూడా చాలా సినిమాలలో నటించి మెప్పించింది శరణ్య. తెలుగు, తమిళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది శరణ్య. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే శరణ్య భర్త సైతం ఇండస్ట్రీలో చాలా ఫేమస్ నటుడు కావడం విశేషం. కోలీవుడ్ ఇండస్ట్రీలో శరణ్య భర్త పొన్వన్నన్ పాపులర్ డైరెక్టర్ కమ్ యాక్టర్. అయితే శరణ్య గురించి ఆమె భర్త గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఆమె ఫ్యామిలీ గురించి మనం చాలామందికి తెలియదు.

కాగా శరణ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు చాందిని ప్రియదర్శిని. తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుండగా వీరి కూతుర్లు మాత్రమే ఇంకొక రంగాన్ని ఎంచుకున్నారు. ఇద్దరు కూడా ఒకే రంగాన్ని ఎందుకు ఉంచుకోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం. ఇద్దరూ డాక్టర్లుగా పట్టబద్రులు అయ్యారు. చాందిని ఎంబిబిఎస్ పూర్తి చేయగా తాజాగా అమ్మాయి ప్రియదర్శిని కూడా శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎంబిబిఎస్ ను పూర్తి చేసింది. అయితే సంబంధించిన ఫోటోలను శరణ్య తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం డాక్టర్లు మాత్రమే కాదండి అందంలో హీరోయిన్లను మించిపోయారు. చాలామంది ఆ ఫోటోలు వైరల్ కావడంతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వచ్చు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.