Sowmya Sharada: తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య.. ఇది పర్మినెంట్ జాబ్ కాదంటూ!

Sowmya Sharada: తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ సౌమ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె పూర్తి పేరు సౌమ్య శారద. జబర్దస్త్ షో నుంచి అనసూయ వెళ్ళిపోవడంతో ఆ తర్వాత సౌమ్య ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చిరాని తెలుగుతో యాంకరింగ్ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె తెలుగు ఆమెకు బాగా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. అలా తక్కువ టైంలోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది సౌమ్య. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్య ఇండస్ట్రీ గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలుగు మిమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుంది కదా ఇక్కడికి షిఫ్ట్ అవ్వొచ్చు కదా? ఇక్కడే ఒక ఇల్లు తీసుకోవచ్చు కదా అని అడగగా.. సౌమ్య స్పందిస్తూ.. అయ్యయ్యో ఈ ఇండస్ట్రీని నమ్ముకొని నేను షిఫ్ట్ అయితే అంతే. ఈ ఇండస్ట్రీలో ఇవాళ ఉన్నవాళ్లు రేపు ఉండరు. రేపు ఉండే వాళ్ళు ఎల్లుండి ఉండరు. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. ఎప్పుడు ఎవరి పొజిషన్ ఏమైనా అవ్వవచ్చు. దీన్ని నమ్ముకొని మనం వస్తే బాగుండదు. దేవుడి దయవల్ల అలాంటి ఒక రోజు వస్తే వంద శాతం ఇక్కడే ఉండటానికి ట్రై చేస్తాను అని తెలిపింది.

దీంతో సౌమ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కొంతమంది ఈ కామెంట్స్ ని నెగిటివ్ గా తీసుకుంటున్నారు. అయితే సౌమ్య ఇక్కడ ఎప్పుడు ఛాన్సులు ఉంటాయో, ఉండవో తెలీదు. అలాంటిది ఇక్కడ ఛాన్సులు వస్తాయని నమ్ముకొని ఇక్కడికి వస్తే కష్టం అన్నట్టు చెప్పింది. కొందరు ఆమెపై ట్రోల్స్ చేస్తుండగా మరికొందరు ఆమె చెప్పింది కరెక్టే అంటూ సౌమ్యకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సౌమ్యకు తెలుగులో బాగానే అవకాశాలు వస్తున్నాయి. మరి ముందు ముందు సౌమ్యకి అవకాశాలు వస్తాయా రావా అనేది చూడాలి మరి.