Sai pallavi: రెండు కోట్ల రూపాయల యాడ్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి…షాక్ లో అభిమానులు!

Sai pallavi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి సెలబ్రిటీలకు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తే అవకాశం కల్పిస్తూ ఉంటారు ఉత్పత్తిదారులు. ఇలా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయడం కోసం వారికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది హీరో హీరోయిన్లు ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే సినీనటి సాయి పల్లవికి సైతం ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ ఆమెకు మంచి అవకాశాలే వచ్చాయి. అయితే సాయి పల్లవి మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక యాడ్ రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. మరి ఆ యాడ్ ఏంటి అనే విషయానికి వస్తే… హీరోయిన్లకు ఎక్కువగా సౌందర్యాన్ని పెంపొందింపచేసుకునే బ్రాండ్లనే ప్రమోట్ చేయాలి అంటూ ఆఫర్ కల్పిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే సాయి పల్లవికి కూడా ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.కాస్మోటిక్ కు సంబంధించిన ఆ యాడ్ చేసేందుకు సాయి పల్లవి నిరాకరించారు. సౌందర్య సాధానాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని.దీంతో ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని.. అందుకే తాను ఎలాంటి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనని తెగేసి చెప్పారట. ఈ యాడ్ చేస్తే కనుక తనకు ఏకంగా రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ సాయి పల్లవి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది.

ఇక సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణం, సినిమాతో పాటు పాలు తమిళ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల అమరన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.