వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న సంచలన నిర్ణయాల్లో శాసనమండలి రద్దు కూడ ఒకటి. మూడు రాజధానులు, సీర్డీయే రద్దు బిల్లులకు మండలి అడ్డు తగలడంతో వైఎస్ జగన్ అసలు పెద్దల సభ ఎందుకు, ఖర్చు దండగ. పైగా కీలకమైన బిల్లులకు మొకాలడ్డుతున్నారు అంటూ రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు. శాసనసభ ఎకపక్ష ఆమోదంతో మండలి రద్దును ఆమోదించాలని కేంద్రం వద్దకు బిల్లును పంపారు. నిజానికి మండలిని రద్దు చేయడం కొత్తేమీ కాదు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం ఇప్పుడు జగన్ చెప్పిన కారణాలే చెప్పి మండలిని రద్దు చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పుమరుద్దరించారు. అలా వైఎస్ కావాలని పట్టుబట్టి పునరుద్దరించుకున్న మండలిని ఆయన వారసుడు జగన్ రద్దు చేయాలని అనుకోవడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం బిల్లు కేంద్రం ముందు ఉంది. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇది చర్చకు రావాలి. కానీ కరోనా ద్రుష్ట్యా సమావేశాల రోజులను తగ్గించడం, లోక్ సభ, రాజ్యసభ రెంటినీ వేరు వేరు చోట్ల సమావేశపరుస్తుండటంతో కీలకమైన బిల్లులే చర్చకు వస్తాయని, మండలి రద్దు బిల్లు చర్చకు వచ్చే అవకాశం లేదని చాలామంది అంటున్నారు. ఇదే రద్దు విషయంలో జగన్ను పునరాలోచనలో పడేలా చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో విషయం తేలకపోతే మళ్లీ ఎప్పుడు చర్చకు వస్తుందో చెప్పడం కష్టం. పైపెచ్చు కేంద్రం సైతం రద్దు బిల్లుపై ఇప్పుడే నిర్ణయం తీసుకునేలా కనిపించట్లేదు.
ఎందుకంటే.. ఒక్క ఏపీలోనే కాదు.. మండలిని ఉంచాలా వద్దా అనే మీమాంస చాలా రాష్ట్రాల్లో ఉంది. కొందరు వద్దంటే ఇంకొందరు పునరుద్దరించమని అడుగుతున్నారు. అందుకే దీనిపై ఇక కమిటీ వేసి దేశం మొత్తం ఒకే విధానం అమలయ్యేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ఇదే ఇన్ఫర్మేషన్ జగన్ వద్దకు వచ్చిందట. అంతేకాదు ఇప్పటికే గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను జగన్ తన పార్టీ నాయకులకు కేటాయించారు. వారి నియామకాన్ని గవర్నర్ ఆమోదించారు. అంతేకాదు మోపిదేవి, పిల్లి సుభాష్ ఖాళీ చేసిన స్థానాలను, త్వరలో ఖాళీ కానున్న ఇంకో రెండు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం దృష్ట్యా ఆ స్థానాలు కూడ వైసీపీకే దక్కనున్నాయి. అంటే మండలిలో వైసీపీ బలం పెరగనుంది. అప్పుడు అసెంబ్లీలో ఆడుకుంటున్నట్టే మండలిలోనూ తమదే రాజ్యమని, అడ్డుచెప్పేవారే ఉండరు కనుక మండలిని ఉన్నా ఇబ్బందేం లేదని జగన్ భావిస్తున్నారట.