Nagababu: నాగబాబుకు మంత్రి పదవి… పునరాలోచనలో చంద్రబాబు!

Nagababu: జనసేన నాయకుడు నాగబాబు గత ఎన్నికలలో అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా ఈ టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆయనకు మాత్రం ఏదో ఒక పదవి అయితే తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో ఖాళీల ఏర్పడిన నేపథ్యంలో నాగబాబును పెద్దల సభకు పంపిస్తారని అందరూ భావించారు కానీ అది వీలు కాలేదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. అది కూడా నిజం కాదని తెలిపారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ సభ్యులు రాజీనామాలు చేయడంతో ఆ ఖాళీలను పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఈయనకు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇలా ఎమ్మెల్సీగా నాగబాబుని తీసుకొని అనంతరం ఆయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టు గతంలో చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే చెప్పిన విధంగానే ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉగాది పండుగలోపు క్యాబినెట్లోకి నాగబాబు అడుగు పెడతారని అందరూ భావించారు కానీ మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.

నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.సీఎం చంద్రబాబు ఈ ఉగాదికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే దీని ప్రభావంతో దానిపై ఫోకస్ అంతా పోతుందని కొందరు ఆయనకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబుకు మంత్రి పదవి అనేది మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి కొద్ది నెలలు ఆలస్యమైన ఆయనకు మంత్రి పదవి మాత్రం పక్కా అని స్పష్టమవుతుంది.