AP: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా 164 స్థానాలలో విజయకేతనం ఎగరవేసి కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతగ్రామీణ స్థాయిలో వారి పార్టీలకు గట్టి పునాదిని కల్పించుకోవాలి కానీ కూటమి ప్రభుత్వం విషయంలో ఇది జరగలేదని తెలుస్తోంది.
ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన పది నెలలకి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని తాజాగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వారికే ఎంపీపీ జెడ్పీటీసీలు దక్కుతాయి కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉందని చెప్పాలి.
రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. నిజానికి ఈ 53 స్థానాలు వైసిపి గతంలో కైవసం చేసుకుంది కానీ కొన్ని కారణాలవల్ల ఈ స్థానాలు ఖాళీ అవడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.
ఇక ఈ ఉప ఎన్నికలలో భాగంగా మెజారిటీ లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీ చేసి తన రెడ్ బుక్ ప్రయోగం చేస్తూ అన్ని స్థానాలను టిడిపి కైవసం చేసుకోవాలని చూశారు.అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అన్నిటినీ ఎదర్కొని ధైర్యంగా వైఎస్సార్‌సీపీ కేడర్ నిలిచింది.
టీడీపీ కేవలం తొమ్మిది స్థానాల్లో గెలుపును సరిపెట్టుకుంది. ఆ గెలుపును కూడా వైఎస్సార్‌సీపీ సభ్యులను తమవైపు తిప్పుకుని ఆ గెలుపుని తమ ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్యులైన బీజేపీ, జనసేనలు పోలీసులను ప్రయోగించి చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి ఇలా ఈ ఎన్నికల ఫలితాలు కనుక చూస్తుంటే రాష్ట్రంలో 9 నెలలకే కూటమి ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందనే స్పష్టమవుతుంది.