YS Jagan: వైసీపీ కేడర్ పై జగన్మోహన్ రెడ్డి న్యూ ఎలివేషన్స్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తాచాటిన నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకే కాదు, ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఫలితాలను అభివర్ణించారు. అన్ని విధాల ఒత్తిడులు, బెదిరింపులు ఎదురైనా వైసీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని, తమ అభ్యర్థులను గెలిపించి మరింత నమ్మకాన్ని చాటారని ప్రశంసలు కురిపించారు.

సామూహికంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలాంటి బలంతో రాలేనప్పటికీ, పోలీసులు, కేసులు, భయాల నాటకంతో ఎన్నికలను ప్రభావితం చేయాలన్న కుట్రలు ఫలించలేదని జగన్ విమర్శించారు. “చంద్రబాబు అహంకారాన్ని దాచిపెట్టలేక ఆస్తులపై దాడులు చేస్తామని బెదిరించారు. బంధువుల ఉద్యోగాలపై ముప్పు చూపించారు. అయినా మన ప్రజాప్రతినిధులు నిలదొక్కుకున్నారు” అని స్పష్టం చేశారు.

ఎన్నో ఆఫర్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పార్టీలోనే ఉండి పోరాడిన తీరు పార్టీకి గర్వకారణంగా మారిందని జగన్ పేర్కొన్నారు. విలువలకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వారిని చూసి గర్వంగా ఉందని అన్నారు. ఈ కష్టకాలంలో వారు చూపిన ధైర్యమే పార్టీకి కొత్త ఉత్సాహాన్ని అందించిందన్నారు.

ఈ విజయాన్ని శ్రమించి సాధించిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ కార్యాలయ సిబ్బంది అందరి సమిష్టి కృషి వల్లే ఈ ఫలితం సాధ్యమైందని చెప్పారు. ఎప్పుడూ వెన్నెముకలా నిలబడి పార్టీకి ఊపిరిగా ఉండే కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ఉప ఎన్నికల్లో విజయంతో పార్టీ మోరల్ బూస్ట్ పొందిందని నేతలు పేర్కొంటున్నారు.

స్కెచ్ వేసింది పిలిచిన స్నేహితుడే..? | Cine Critic Dasari Vignan Shoking Facts | Telugu Rajyam