Nara Lokesh: నేడు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అలాగే ఇతర మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేశారో వారందరి పేర్లను కూడా లోకేష్ రెడ్ బుక్ లో రాసానని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఇబ్బందులకు గురి చేసిన వారిపై సమర శంఖం పూరించారు.
ఇప్పటికే ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొంతమంది పేర్లను ఎంపిక చేసుకొని వారికి రెడ్ బుక్కు పవర్ అంటే ఏంటో చూపిస్తున్నారు. అయితే తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నారా లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. రెడ్ బుక్ ఈ పేరు వింటనే కొందరికి గుండెపోటు వస్తుందంటూ.. ఇండైరెక్ట్‌గా కొడాలి నాని గురించి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక రెడ్ బుక్ పేరు వింటే మరికొందరు బాత్‌రూమ్‌లో పడి చెయ్యి విరగ్గొట్టుకుంటున్నారంటూ పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి గురించి మాట్లాడారు. అర్థమైందా రాజా…అధికారాన్ని చూసి ఎన్నడూ గర్వపడొద్దంటూ మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష వైసీపీ నేతలకు హితవు పలికారు.