తెలుగు సినిమా మేకర్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టార్లను గెస్ట్ రోల్స్‌లో తీసుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. ఫ్రీగా రానివాళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, వారి గెస్ట్ అప్పీల్‌తో సినిమాలకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ ప్లస్ కంటే మైనస్ అవుతుందనేది తాజా ఉదాహరణలతో స్పష్టమవుతోంది.
విజయ్ దేవరకొండ లైగర్‌లో మైక్ టైసన్‌ను తీసుకొచ్చిన సమయంలో ఎంత ప్రమోషన్ చేశారో గుర్తుండే ఉంటుంది. కానీ ఆ పాత్ర సినిమాకు ఎంతవరకు అవసరమో, అనేది డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే తంతు నితిన్ రాబిన్ హుడ్‌లో జరిగింది. డేవిడ్ వార్నర్ క్లైమాక్స్‌లో కేవలం కొన్ని నిమిషాలు కనిపించాడంతే. అంతకు మించి ప్రేక్షకుల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.
వార్నర్ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయినా, ధోని, కోహ్లీ స్థాయిలో క్రేజ్ లేదు. పైగా అతనికి సంబంధించిన సీన్ కూడా థియేటర్‌లో పెద్దగా స్పందన తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో దర్శకులు, నిర్మాతలు ఈ డిసిషన్లపై మరోసారి ఆలోచించడం అవసరం. క్రికెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలంటే మన దేశ స్టార్లనే తీసుకుంటే మెరుగైన ఫలితం వస్తుంది. లేదంటే అలాంటి పాత్రలు స్క్రీన్‌ప్లేలో అర్ధవంతంగా ఉండేలా ప్లాన్ చేయాలి.
ప్రమోషన్ కోసం గెస్ట్ రోల్స్‌ను తీసుకోవడం కన్నా, కథలో మునిగిపోయే క్యామియోలే సినిమాకు విలువ పెంచతాయి. ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటప్పుడు కేవలం స్టార్ గెస్ట్ చూసేందుకు టికెట్ తీసుకునే రోజులు పోయాయి. అటు ఖర్చు, ఇటు కథ దెబ్బతింటే నష్టమే మిగులుతుంది. మరి, తదుపరి సినిమాల్లో దర్శకులు ఈ లెర్నింగ్‌ను వినియోగించుకుంటారో లేదో చూడాలి.