Venuswamy: వేణుస్వామి ఉగాది పంచాంగం… వీరికి పదవి గండం… రాజకీయాలలో సంచలనం జరగనుందా?

Venu Swamy: వేణుస్వామి పరిచయం అవసరం లేనిపేరు. ప్రముఖ జ్యోతిషుడిగా మంచి గుర్తింపు పొందిన ఈయన చెప్పే జ్యోతిష్యం కొన్నిసార్లు నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది. అయితే ఇటీవల వేణు స్వామి తరచు రాజకీయ నాయకులు అలాగే సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇక పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు ఎదురయ్యే ప్రమాదాలు గండాలు గురించి ఈయన మాట్లాడటంతో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రభాస్ విజయ్ దేవరకొండ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటారంటూ ఈయన చెప్పిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే తాజాగా వేణు స్వామి ఉగాది పంచాంగం తెలిపారు.

ఈ ఉగాది పంచాంగం తెలియ చేస్తూ రాజకీయ నాయకులకు పదవీ గండం ఉందని తెలిపారు.ఈ ఏడాది మార్చి 30న ఉగాది నాడే షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల ఏం జరగబోతుందంటే.. ఈ ఏడాది అధిపతి రవి. అంటే సూర్యుడు.. రవి ప్రపంచాన్ని శాసిస్తాడు. పేరు, ప్రఖ్యాతలు ఇస్తాడు. రాజ్యానికి, రాజకీయానికి అధిపతి. హార్ట్‌, లివర్‌, కళ్లకు, చర్మానికి, భార్యాభర్తల బంధానికి అధిపతి సూర్యుడు. ఆయన షష్టగ్రహ కూటమి శనితో కలిసి మీనరాశిలో ఉన్నాడనీ తెలిపారు.

సూర్యుడు ప్రభావితం అవుతాడు. మూడు గ్రహాలు కుజుడు, గురువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలన్నీ మీనరాశిలో బంధించి ఉన్నాయి. రాజ్యాలకు సంబంధించి, దేశాలకు, రాష్ట్రాలకు సంబంధించి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. రాజులకు ప్రాణగండం ఉందని తెలిపారు. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశానికి ప్రధానమంత్రి వంటి వారికి పదవి గండం ఉందని తెలిపారు. రాజకీయ నాయకులు ఏ క్షణమైనా పదవి నుంచి దిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ వేణు స్వామి చెప్పిన ఈ పంచాంగం ప్రస్తుతం వైరల్ అవుతుంది.