Samantha: రూల్స్ పెడితే నాకు అస్సలు నచ్చదు… సమంత కామెంట్స్ చైతన్య గురించేనా?

Samantha: సినీనటి సమంత సినీ, వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పాలి. ఈమె ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మధ్యతరగతి కుటుంబం నుంచి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడం అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత సమంత స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇలా సమంత స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడ్డారు.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం తర్వాత ఎంతో సంతోషంగా గడిపారు కానీ పెళ్లైన మూడు సంవత్సరాలకి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక వీరిద్దరి విడాకులకు గల కారణాలు తెలియదు కానీ ఇద్దరు విడిపోవడానికి ఇదే కారణం అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి.

ఇక వీరిద్దరూ విడిపోయి దాదాపు నాలుగు సంవత్సరాలు కావొచ్చింది. ఇక నాగచైతన్య తిరిగి మరొక నటి శోభితను కూడా పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నాగచైతన్య సమంత గురించి ఏదో ఒక వార్త నిత్యం వినపడుతూనే ఉంటుంది. తాజాగా సమంత సిడ్నీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

రూల్స్ పెడితే తనకు నచ్చదని.. నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటున్నానని సమంత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడం కూడా విజయంలో ఒక భాగమే అంటూ ఆమె చెప్పుకొచ్చారు.సినిమాల్లో తనకు నచ్చిన పాత్రలు చేస్తానని,అప్పుడే నా లైఫ్ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే సమంత ఈ కామెంట్స్ నాగచైతన్యను ఉద్దేశించి చేశారని పలువురు భావిస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ ఈమె విషయంలో కండిషన్లు పెట్టడం వల్లే గొడవలు మొదలయ్యి విడాకులు తీసుకొని బయటకు వచ్చేసారంటూ పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.