రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఉగాది పండుగ రోజున కొన్ని పనులు చేయడం వల్ల లాభం చేకూరితే కొన్ని పనులు చేయడం వల్ల నష్టం కలుగుతుంది. ఉగాది పండుగ రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది పండుగ రోజు నుంచి కొత్త పనులను మొదలుపెట్టడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని చెప్పవచ్చు.
ఉగాది పండుగ రోజున రాశి ఫలాలు, గ్రహ స్థితులు తెలుసుకుని వాటికి అనుకూలంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణం వినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఉగాది పండుగ రోజున దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించడంతో విష్ణువు మత్సావతారం ధరించి సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి సమర్పించిన రోజును ఉగాదిగా జరుపుకుంటామని చెప్పవచ్చు.
ఉగాది పండుగ రోజు నుంచి వసంత ఋతువు కూడా ప్రారంభం అవుతుందనే సంగతి తెలిసిందే. సౌత్ ఇండియాలోన్ ఇతర ప్రాంతాలలో సైతం వేర్వేరు పేర్లతో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు. ఉగాది పచ్చడిలోని ఒక్కో రుచి ఒక్కో భావానికి ప్రతీక అని చెప్పవచ్చు.
ఉగాది పండుగ రోజున మనస్సులోకి చెడు ఆలోచనలను రానీయకూడదు. పండుగ రోజున ఉదయాన్నే స్నానమాచరించి పూజలు చేయాలి. ఉగాది పండగ రోజున పిండి వంటకాలు చేయడంతో పాటు గుడికి వెళ్లాలి. ఈ పనులు చేస్తే ఎంతో మంచిదని చెప్పవచ్చు.