Pawan Kalyan: అబ్బాయికి బాబాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు… విమర్శల పాలైన డిప్యూటీ సీఎం?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రామ్ చరణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు అనే శైలిలో రామ్ చరణ్ కు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక లెటర్ విడుదల చేశారు.

ఇక అభిమానులు కూడా పెద్ద ఎత్తున రామ్ చరణ్ రేర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాంచరణ్ పవన్ కళ్యాణ్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఈయన ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటం జనసేన మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా మరోవైపు పవన్ కళ్యాణ్ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ విడుదల చేస్తూ అధికారిక ప్రభుత్వ లెటర్‌హెడ్‌ను ఉపయోగించారు. అయితే ఇది కాస్త పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది ఇలా ప్రభుత్వ లెటర్ హెడ్ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సున్నితమైన అంశాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు తప్ప ఇలా వ్యక్తిగత విషయాలకు అసలు ఉపయోగించారని తప్పుపడుతున్నారు.

బహుషా ఈ విధమైనటువంటి లెటర్ హెడ్స్ ఎందుకు ఉపయోగించాలి అనే విషయం పవన్ కళ్యాణ్ కు బహుశా తెలియకపోవచ్చు అంటూ మరికొందరు వారి వాదనలను వినిపిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ గుర్తులను కలిగిన లెటర్‌హెడ్‌లను సున్నితమైన అంశాల కోసం మాత్రమే వాడాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రభుత్వ ప్రతీకల విలువ, వాటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అని ఇంకొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు అభినందనలు తెలియజేయడంతో ఇది కాస్త పలు చర్చలకు కారణమైంది.