ఏప్రిల్ సినిమా వర్షం.. థియేటర్లపై 24 సినిమాలు దండయాత్ర!

సినీ ప్రియులకు ఏప్రిల్ నెల ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ మాసం కానుంది. మొత్తం 24 సినిమాలు ఈ నెలలో థియేటర్లకు రానున్నాయి. పెద్ద సినిమాల‌తో పాటు చిన్న చిత్రాలు కూడా వరుసగా విడుదలవుతుండటంతో ప్రేక్షకులు ఎటు వెళితే అటు సినిమా దర్శనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఓ మామూలు వారం కూడా మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ కావడం సహజమే కానీ.. ఒకే నెలలో 24 సినిమాలు అంటే తెలుగు సినీ రంగంలో ప్రత్యేకమే.

ఏప్రిల్ 4వ తేదీనే ఆరంభం భారీగానే ఉండనుంది. అదేరోజు ‘శారీ’, ‘వృషభ’, ‘లెవెల్’, ‘28C’, ‘సీతన్నపేట్ గేట్’ వంటి ఐదు కొత్త చిత్రాలతో పాటు బాలకృష్ణ క్లాసిక్ ‘ఆదిత్య 369’ రీ-రిలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘జాట్’, ‘జాక్’, ‘బజూక్’, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘పూలే’ లాంటి సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి.

అయితే ఏప్రిల్ 18వ తేదీ మాత్రం నిజంగా సినిమాల పండుగే. ‘మధురం’, ‘ఘాటీ’, ‘చౌర్య పాఠం’, ‘సారంగపాణి జాతకం’, ‘మ్యాజిక్’, ‘కేసరి ఛాప్టర్ 2’, ‘భూత్నీ’ లాంటి సినిమాలు ఒకే రోజున వస్తుండటంతో ప్రేక్షకులకు ఛాయిస్ కు ఇది బిగ్ ఛాలెంజ్ లిస్ట్. ఈ నెల చివర్లో ‘కన్నప్ప’, ‘గ్రౌండ్ జీరో’, ‘భద్రకాళీ’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా బరిలోకి దిగుతున్నాయి.

ఇన్ని సినిమాలు విడుదల అవ్వడం సినిమాలపై ఉన్న డిమాండ్‌ను తెలిపినప్పటికీ, వాటి మధ్య పోటీ కూడా తారస్థాయిలో ఉండనుంది. ప్రొమోషన్లు, కంటెంట్, మౌత్ టాక్ మీద ఆధారపడి సినిమాలు విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ బజ్ క్రియేట్ చేయలేకపోతే చిన్న సినిమాలు తేలిపోవడమే కాక, పెద్ద సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవచ్చు. ఏది ఏమైనా ఈ నెల థియేటర్లలో సందడి ఖాయం.