శరీరంలోని కొవ్వును కరిగించాలంటే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాలున్న ఆహారం తీసుకోవడం, నీరు తగినంతగా తాగడం, నిద్ర సరిపడా తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. నడక, పరుగు, సైక్లింగ్, ఈత లాంటి వ్యాయామాలు కేలరీలను కరిగించడంతో పాటు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. కండరాలను బలోపేతం చేయడానికి మరియు జీవక్రియను పెంచడానికి వ్యాయామాలు చేస్తే మంచిది.
వారంలో కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాలను తగ్గించి, తక్కువ కేలరీల ఆహారాలను తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయడంతో పాటు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి.
తక్కువ కొవ్వు మరియు చక్కెర ఉన్న ఆహారాలను ఎంచుకోవాలి. తగినంత నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. ప్రతి రాత్రి 7 – 8 గంటలు నిద్ర అవసరం అని చెప్పవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా, ధ్యానం లాంటివి చేయడం ద్వారా కొవ్వు కరిగే ఛాన్స్ ఉంటుంది. మితంగా మద్యం తీసుకుంటూ పొగ త్రాగే అలవాటుకు దూరంగా ఉండాలి.
బరువు తగ్గడానికి మరియు శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడానికి లేదా కండర ద్రవ్యరాశిని పెంచడానికి, కనీసం 3 వారాల పాటు అధిక తీవ్రతతో రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. మీరు ఏమి తింటున్నారో మరియు ఎంత వ్యాయామం చేస్తున్నారో ఒక డైరీలో రాసుకోవడంతో పాటు అవసరమైతే పోషకాహార నిపుణులను సంప్రదించాలి.