Chandra Babu: పవన్ కళ్యాణ్, బాలయ్య పై మనసులో మాట బయట పెట్టిన బాబు… ఏమన్నారంటే!

Chandra Babu: గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, బిజెపి ,జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే గత కొంతకాలంగా కూటమిలో అభిప్రాయ భేదాలు వచ్చాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య పెద్దగా మాటలు కూడా లేవని ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోన్ కి కూడా అందుబాటులో లేకుండా పోయారు అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

ఇక నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంతో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి అంటూ కూటమినేతల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గురించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మద్రాస్‌లోని ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన ఒక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులు ఆయనను చూసి పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు, చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది.

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.. అదేవిధంగా విద్యార్థులు బాలకృష్ణ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమని కోరారు. బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అంటూ ప్రశ్నలు వేయడంతో చంద్రబాబు నాయుడు స్పందిస్తూ….

పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇద్దరు కూడా వారు సినిమాలతో పాటు ప్రజా జీవితంలో బిజీగా ఉన్నారు. కళ్యాణ్ – బాలకృష్ణ ఇద్దరూ చాలా బాగా చేస్తున్నారు. ఈ రాజకీయ ప్రముఖుల పట్ల ఇంత ఆసక్తి చూపుతున్నందుకు విద్యార్థులను అభినందిస్తున్నానని తెలిపారు. మీరు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎంతో గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ మీరు మాత్రం సినిమాలు చూడటం మానరు.మీకున్న ఈ అభిమానాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ బాలయ్య ఇద్దరు కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులని కొనియాడారు.