శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం ఈ చిన్న పని చేయాల్సిందే!

శని దేవుడు పేరు చెప్పగానే చాలా మంది దరిదాపుల్లోకి కూడా రారు. శని ప్రభావం మనపై పడితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుందని చాలా మంది నవ గ్రహాలను కూడా నమస్కరించరు.ఇలా నవగ్రహాలకు పూజ చేయడం వల్ల శని ప్రభావం మనపై ఉంటుంది అంటే అది కేవలం అపోహ మాత్రమే అని చెప్పాలి. అందరి దేవుళ్ళు మాదిరిగానే శని దేవుడు కూడా ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తారు. అయితే మనం చేసిన కర్మలకు ఫలితంగా ఆయన ప్రభావం మనపై ఉంటుంది.ఇక పోతే మనకు మంచి జరగడం కోసం శని దేవున్ని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మరి ఆ పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

శనివారం శని దేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు ప్రతి ఒక్కరూ శని దేవుడిని పూజించడం వల్ల ఆయన ప్రసన్నం కలుగుతుంది. అయితే శని దేవుడిని పూజించే వారు శనివారం తప్పనిసరిగా నలుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే శనీశ్వరునికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. అందుకే శనివారం నలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయటం వల్ల శనీశ్వరుని అనుగ్రహం మనపై ఉంటుంది.

అలాగే శనివారం శనీశ్వర ఆలయానికి వెళ్లి స్వామివారికి నల్లని నువ్వులు చలిమిడి సమర్పించి పూజ చేయాలి అలాగే నీలిరంగు పుష్పాలను స్వామివారికి సమర్పించాలి. ఇక శనివారం దానధర్మాలు చేయాల్సి వస్తే నల్లని నువ్వులు, నల్లటి వస్త్రాలు, ఇనుమును దానం చేయటం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం మనపై కలుగుతుంది.ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే శనీశ్వరునికి ఎలాంటి పరిస్థితులలో కూడా రాగి వస్తువులతో పూజ చేయకూడదు అలాగే ఎరుపు రంగు వస్తువులను శనీశ్వరుని పూజలో ఏమాత్రం ఉపయోగించకూడదు.