మీ ఇంట్లో చెక్కతో కూడిన గుడి ఉందా.. ఈ వాస్తు నియమాలను తెలుసుకోవాల్సిందే!

మనలో చాలామంది వాస్తు విషయంలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. వాస్తు విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది చెక్కతో కూడిన దేవుని గదిని, గుడిని నిర్మించుకుంటున్నారు. మీ ఇంట్లో చెక్కతో కూడిన గుడి ఉంటే ఆ చెక్క ఎలాంటి పురుగులు పట్టని టేకు లేదా రోజ్ వుడ్ చెక్క అయితే మంచిది.

ఇంట్లో చెక్క గుడిని ఏర్పాటు చేసేవాళ్లు ఇంటికి ఈశాన్య లేదా తూర్పు మూలలో మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఈ దిశగా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆలయ స్థలంలో గంగాజలాన్ని చల్లితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని పండితులు వెల్లడిస్తున్నారు. పూజించేవారు తూర్పు వైపు దేవతల విగ్రహాలు లేదా పటాలు పడమర వైపు ఉండాలి.

పూజ గదిలో కూర్చునే సమయంలో కార్పెట్ లేదా చాప లేదా పూజ చౌకీలను వినియోగిస్తే కొంత ఇన్సులేషన్ ఉంటుందని చెప్పవచ్చు. వాష్‌రూమ్‌కి ఆనుకొని పూజ గది ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పడకగదిలో చెక్క దేవాలయం ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా నెగిటివ్ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. శుభప్రదమైన రోజుల్లో ఆలయంలో శంఖుస్థాపన చేస్తే మంచిది.

చెక్క ఆలయం లోపల పూర్వీకుల విగ్రహాలను ఉంచితే చెడు ఫలితాలు కలిగే ఛాన్స్ ఉంటుంది. పగుళ్లు లేదా దెబ్బతిన్న విగ్రహాలను పూజగదిలో ఉంచకూడదు. భారీ విగ్రహాలకు బదులుగా చిన్న విగ్రహాలను పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే బెటర్ అని చెప్పవచ్చు. చెక్క గుడిని ఏర్పాటు చేసుకునే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.