చిటికెడు ఉప్పు నీటిలో కలిపి తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత, జీర్ణశక్తి మెరుగుపడటం, శక్తి లభించడం, కండరాల నొప్పులు తగ్గడం, చర్మం మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పులో ఉండే సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతాయి. ఉప్పు నీరు జీర్ణ ద్రవాల స్రావాన్ని పెంచి, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.
ఉప్పు నీరు తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది, ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందడం వల్ల కండరాల తిమ్మిరి తగ్గుతుంది. ఉప్పు నీరు కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉప్పు నీరు చర్మం పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది, శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది, శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది. ఉప్పు నీరు ప్రేగు కదలికలకు సహాయపడుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది, నిర్విషీకరణ ప్రక్రియలో సహాయపడుతుంది.
నరాల పనితీరును సైతం మెరుగుపరిచే విషయంలో ఉప్పునీరు తోడ్పడుతుందని చెప్పవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరిచే విషయంలో ఉప్పునీరు సహాయపడుతుంది. చిటికెడు ఉప్పునీరు తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని ఇవ్వడంలో ఉప్పు నీరు ఉపయోగపడుతుంది. ఉప్పు నీరు అలసటకు చెక్ పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ చిట్కాలు ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు పాటించడం మంచిది కాదు. ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. అయితే ఉప్పు నీళ్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు.