మన దేశంలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే సంగతి తెలిసిందే. హిందూమతంలో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి కేటాయించగా శనివారం రోజు భైరవుడు రోజు కావడం గమనార్హం. శనివారం రోజున శని స్వభావం భయంకరంగా ఉంటుంది. శనివారం న్యాయం, కర్మల దేవుడు శనీశ్వరుడికి అంకితం చేయడిన రోజు కాగా శనిదేవుని అశీర్వాదం మనపై ఉంటే మన లైఫ్ లో ఎలాంటి లోటు ఉండదు.
అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుందని చాలామంది భావిస్తారు. శనివారం రోజున కొన్ని పనులు చేయడం ఏ మాత్రం మంచిది కాదు. శనివారం రోజున ఏవైనా తప్పులు చేస్తే చేపట్టిన పనులన్నీ చెడిపోవడం జరుగుతుంది. శనీశ్వరుని ఆగ్రహానికి సైతం గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. శనివారం రోజున ఆవనూనె లేదా మరేదైనా నూనె కొనుగోలు చేయడం మంచిది కాదు.
శనివారం రోజున నూనె దానం చేస్తే మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. శనివారం రోజున ఆవాల నూనె, లేదా నువ్వుల నూనెను దానం చేస్తే శనీశ్వరుడు సంతోషపడతాడు. శనివారం తలస్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. స్త్రీలు శనివారం రోజున జుట్టు కడగడం వల్ల ఇంటిపై చెడు ప్రభావం పడుతుంది. శనివారం ఇనుప వస్తువులను ఇంటికి తీసుకొనిరాకూడదు.
శనివారం రోజున ఇనుమును, ఇనుప వస్తువులను ఇంటికి తీసుకొనివస్తే చెడు జరుగుతుంది. శనివారం రోజున మాంసం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. శనివారం రోజున ఇంట్లోకి ఉప్పు తీసుకొనిరావడం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. శనివారం రోజున ఇంటికి ఉప్పును తెస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.