ఏలినాటి శని దోషం పోవాలంటే పాటించాల్సిన పరిహారాలు ఇవే.. ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో చాలామంది ఏలినాటి శని దోషం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శని దేవుడు న్యాయానికి, కర్మలకు అధిపతి కాగా శని దేవుడే ఎవరి కర్మలకు ఎలాంటి ఫలాలు పొందాలో నిర్ణయిస్తారని చాలామంది భావిస్తారు. ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వాళ్లు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని ప్రభావం ఉన్నవారు కొన్ని పరిహారాలను పాటిస్తే మంచిది.

సూర్యాస్తమయం తర్వాత హనుమంతుడిని ఆరాధిస్తే మంచిది. హనుమంతుడికి పూజ చేసే సమయంలో పచ్చిమిర్చిని సమర్పించి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది. నీలం రంగులో పువ్వులను హనుమంతునికి సమర్పించడం ద్వారా అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.+ శని యంత్రం స్థాపించి క్రమ పద్ధతిలో పూజించడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి.

నీలం లేదా నలుపు రంగు పువ్వులను సమర్పిస్తే శని దేవుడు సంతోషిస్తాడు. శనివారం రోజున శనగలను ఆవాల నూనెలో వేయించి శని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. పావు కిలోల పప్పును గేదెకు పావు కిలో కుష్టు రోగులకు తినిపించి మూడో పావును ఇంటి నుంచి దూరంగా విసిరేయాలి. శనివారం మర్రిచెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి, ధూపం సమర్పిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.

శని దోషం పోవాలంటే ఈ చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని దూరం చేసుకోవచ్చు.ఏలినాటి శని ప్రభావంతో బాధ పడేవాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.