శనీశ్వరుని అనుగ్రహం ఉండాలంటే చేయాల్సిన పనులు ఇవే.. ఈ విధంగా చేయాలా?

మనలో చాలామంది శనీశ్వరుని అనుగ్రహం లేకపోవడం వల్లే జీవితంలో కష్టాలు ఉన్నాయని భావిస్తూ ఉంటారు. శనివారం రోజున శనీశ్వరుడిని ఆరాధించడం వల్ల కష్టాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో అధ్యాత్మిక వేత్తల నుంచి కూడా భరోసా లభిస్తోంది. శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా ఆటంకాలు తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది.

శనివారం రోజున పూజ చేసి శని చాలీసా జపించడం వల్ల సులువుగా కష్టాలు సైతం తొలగిపోతాయి. శనివారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల శని ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి. శనివారం రోజున ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో వాళ్లు శని అనుగ్రహ పాత్రులు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

రావి చెట్టుతో శని దేవుడు ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. శని అనుగ్రహం కొరకు ఈరోజు గిన్నెలో పాలు పోసి నీళ్లు పోసి చక్కెర వేసి దానిని రావిచెట్టు కింద నైవేద్యంగా పెట్టాలి. శనివారం రోజున దశరథ విరచిత శనిస్తోత్రం పఠించడం వల్ల శనిగ్రహ ప్రభావం తగ్గుతుందని చెప్పవచ్చు.

ఈ విధంగా చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. శని దేవుడిని ఆరాధించడం వల్ల మనకు ఉన్న కష్టాలు సైతం సులువుగా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి.