Sai Pallavi : మన టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా నాని తన సహజమైన నటనతో ఎలా ఎంత పేరు తెచ్చుకున్నాడో అలానే తన నటనతో పాటుగా తన అత్యంత సహజ లుక్స్ తో నాచురల్ బ్యూటీ గా సాయి పల్లవి మంచి క్రేజ్ ని తన సినిమాలతో తెచ్చుకుంది. మరి అలాంటి ఈ ఇద్దరూ నాచురల్ నటులు కూడా కలిసి నటించిన రెండో సినిమా లేటెస్ట్ “శ్యామ్ సింగ రాయ్” ఈ వారంలో రిలీజ్ కి రెడీగా ఉన్న మరో భారీ సినిమా ఇది.
అయితే మొన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సాయి పల్లవి ఒక్కసారిగా స్టేజ్ పై ఏడ్చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు అసలు ఆరోజు ఆమె ఎందుకు అంతలా ఏడ్చేసింది అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోజు ఆ స్టేజి పై నృత్యం చేసేవాళ్ళు కళాకారులు అందరినీ చూసి ఒక్కసారిగా ఎందుకో చాలా భావోద్వేగం కలిగింది అని..
పైగా అదే సమయంలో నా కోసం అభిమానులు అంతలా అరవడం చూసి ఇక కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశానని చెప్పింది. అయితే అదేమీ బాధతో ఏడ్చింది కాదనీ అభిమానులకి తనని ఇక్కడ వరకు తీసుకొచ్చిన దర్శకులు మీద నాకున్న ఋణం వల్ల వచ్చినవి అని సాయి పల్లవి అసలు మేటర్ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా కి టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వం వహించాడు మరి ఇదెంత థ్రిల్ ని ఇస్తుందో చూడాలి.