Ram Charan: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తూనే మరొకవైపు సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నారు. అలాగే వరుసగా ఇంటర్వ్యూలకు షోలకు హాజరవుతున్నారు చెర్రీ. అందులో భాగంగానే ఇటీవలే బాలయ్య బాబు షోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రామ్ చరణ్ క్రికెటర్స్ తో చేసుకున్నట్టు తెలుస్తోంది.
.తాజాగా రామ్ చరణ్ క్రికెటర్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి ఉన్న ఒక ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో రామ్ చరణ్ తో పాటు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఫొటోల్లో చరణ్ ఫుల్ బ్లాక్ డ్రెస్ లో, RC16 లుక్స్ తో స్టైల్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఈ సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయి, ఇంకా ఎవరెవరు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు అనేది తెలియలేదు. ఓ రెండు ఫొటోలు మాత్రం లీక్ అయి బయటకు వచ్చాయి.
ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చెర్రీ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఫొటోస్ పై అభిమానులు రకరకాలుగా స్పందిస్తూ న్యూ ఇయర్ విషెస్ ని తెలుపుతున్నారు. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం చెర్రీ ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.