Armaan Malik: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఒకటి తరువాత ఒకరు సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా కూడా ఒక స్టార్ సింగర్ ఎటువంటి హంగులు ఆర్బాటలు లేకుండా ఎలాంటి హిట్ ఇవ్వకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు. ఆ స్టార్ సింగర్ మరెవరో కాదు ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్. ఈయన తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక ఇంటివాడు అయ్యాడు. తన స్నేహితురాలు ఆష్నా ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎవరికీ తెలియకుండా రహస్యంగా వీరు పెళ్లి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. అర్మాన్ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ ఫొటోలు చూసి అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అర్మాన్, ఆష్నా చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్ లో ఉన్నారు. 2023లో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా తమ ప్రేమ బంధాన్ని ప్రకటించారు. నిశ్చితార్థం చేసుకున్న దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి ఇద్దరూ పెళ్లి తో ఒక్కటయ్యారు. అయితే అర్మాన్ తమ పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచడంపై చర్చ జరగుతోంది. కాగా కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన అర్మాన్, ఆష్నాలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.
ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ నవ దంపతులకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే సింగర్ ఆర్మాన్ మాలిక్ విషయానికి వస్తే.. ఎన్నో మంచి మంచి పాటలను పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు ఆర్మన్ మాలిక్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సింగర్స్ లో ఆర్మాన్ మాలిక్ కూడా ఒకరు.