Pawan Kalyan: సజ్జలను టార్గెట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం… విచారణకు ఆదేశాలు జారీ?

Pawan Kalyan: వైకాపా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కదా ఐదు సంవత్సరాల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున భూ కబ్జాలు నిర్వహించారు అంటూ వార్తలు వచ్చాయి.కబ్జా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. భూకబ్జాలపై వెంటనే విచారణ చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలను జారీ చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వాటిని తమ సొంత ఆస్తిగా చేసుకున్నారంటూ విమర్శలు కురిపించారు.52 ఎకరాల చుక్కల భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు కబ్జా చేశారనే ఆరోపణలు రావడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.

ఇక ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేస్తూ…పేదలు, ప్రభుత్వ భూముల జోలికి ఎవ్వరూ వచ్చిన సహించేది లేదని ఈయన స్పష్టం చేశారు అదేవిధంగా విచారణ జరిపి తనుకు నివేదికలు పంపించాలంటూ అధికారులకి సూచనలు చేశారు.సజ్జల కుటుంబం రిజర్వు ఫారెస్ట్ భూముల ఆక్రమణపై విచారణ జరపాలని ఈ భూ ఆక్రమ కారణంగా ఎంత మేర అటవీ ప్రాంతాన్ని ఆక్రమించారు. అదేవిధంగా ఏ ఏ వన్యప్రాణులకు నష్టం కలిగిందో నివేదిక ఇవ్వాలి అంటూ పిసిసిఎఫ్ ను ఆదేశించారు.

సజ్జల కుటుంబం ఆక్రమించిన భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయా ? ఎన్ని ఎకరాలు అక్రమించారో నివేదికలు పంపించాలని కడప కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. మరి ఈ విచారణలో ఎలాంటి నిజా నిజాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే సజ్జల అడవులను కనుక ఆక్రమించి ఉంటే ఆయనపై చర్యలు తప్పవని స్పష్టమవుతుంది.