TG: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ టెండర్ విషయంలో హరీష్ రావు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో తప్పుపడుతూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ టెండర్ ₹7,000 కోట్లకు జరిగింది అయితే ఈ విషయంలో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ ఏకంగా 12 వేల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. టెండర్ ఏడు వేల కోట్లకు జరిగితే 12 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇలా చేయటం వల్ల ప్రజలపై భారం పడుతుందని, అవినీతి జరిగింది అంటూ కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా హరీశ్ రావు, కేటీఆర్ మారడం లేదన్నారు. కేటీఆర్ హరీష్ రావు మానసిక స్థితి ఏమాత్రం బాగాలేదు. పార్టీకి భవిష్యత్ లేకపోవటం, మరో 20 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న అంచనాలతో ఈ బావ బామ్మర్దులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక గతంలో కేసీఆర్ మాట్లాడుతూ తాను ఓడిపోతే ఫామ్ హౌస్ లో ఉంటానని చెప్పారు. ఆయన మాటకు కట్టబడి ఉండాలని తెలిపారు. ఆయన అసెంబ్లీకి రాకపోయినా పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదని కోమటిరెడ్డి వెల్లడించారు.
2017 వ సంవత్సరంలోనే కేంద్రం త్రిపుల్ ఆర్ శాంక్షన్ చేస్తే ఇప్పటివరకు ఎందుకు గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు బావబామ్మర్దిలే సమాధానం చెప్పాలి అంటూ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఇలా త్రిపుల్ ఆర్ టెండర్ విషయంలో రేవంత్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.