JC Prabhakar Reddy: సినీనటి బీజేపీ మహిళ నేత అయినటువంటి మాధవి లత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఈమె సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన విషయాలు గానీ లేదా రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈమె తన అభిప్రాయాలను తెలియజేసే క్రమంలోనే వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.
ఇకపోతే ఇటీవల ఈమె ఒక వీడియోలో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం కోసం తాడిపత్రికి చెందిన మహిళలు ఎవరు కూడా జేసీ పార్క్ వైపుకు వెళ్ళదు అంటూ ఈమె సూచనలు చేశారు. అక్కడ అత్యంత ధారణమైన సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విధంగా మాధవి లత చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ..మాధవి లతను ప్రా…. తో పోల్చి ఆమె పై ఫైర్ అయ్యారు. అసలు బీజేపీ నేతలు.. మాధవి లతను ఎందుకు పెట్టుకున్నారో తెలియదని.. ఆమె పెద్ద వేస్ట్ వ్యక్తి అంటూ ఆగ్రహించారు. ఒక మహిళ అయుండుకొని ఈమె మహిళల గురించి ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదని తెలిపారు. కనీసం ఆ బీజేపీ వాళ్ళు మంచి వారినైనా పెట్టుకోండి అంటూ ఈయన సూచనలు చేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా మహిళలు జేసీ పార్కు వద్దకు వెళ్లకూడదని ఆమె మాట్లాడారు. జేసీ పార్కులో ఎలాంటి సంఘటనలు జరగడంలేదని వివరించారు. అటు బీజేపీ నేత యామిని శర్మపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బతుకు దెరువు కోసం పార్టీలు మారే మనుషులతో మాట్లాడిస్తారా అంటూ మండిపడ్డారు. మరి జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై యామిని శర్మ అలాగే మాధవి లత ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
బీజేపీ నాయకురాలు మాధవి లత పై జెసి సంచలన వ్యాఖ్యలు
మాధవి లతను ప్రా…. తో పోల్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి pic.twitter.com/ix4rDdRhdc
— greatandhra (@greatandhranews) January 2, 2025