UI Movie In OTT: విడుదలై నెల రోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర మూవీ!

UI Movie In OTT: కన్నడ నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం యూఐ. ఈ సినిమా ఇటీవల డిసెంబర్ 20న విడుదలైన విషయం తెలిసిందే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల అయింది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదట్లో కలెక్షన్లను బాగా రాబట్టింది. మామూలు ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోయినప్పటికీ ఉపేంద్ర అభిమానులకు మాత్రం ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఇక సుదీప్ నటించిన మ్యాక్స్ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా కలెక్షన్లపై కాస్త ప్రభావం చూపించింది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు యూఐ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. కాబట్టి థియేటర్లలో సినిమా మిస్ అయిన వారు ఎంచెక్క ఓటీటీలో ఉప్పీ సినిమాను చూడవచ్చు. యూఐ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. సినిమా స్ట్రీమింగ్ గురించి సన్‌నెక్స్ట్ ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్‌లను షేర్ చేయనప్పటికీ, మరికొద్ది రోజుల్లో యూఐ సిమా సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈనెల 15 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా విడుదల అయ్యి కనీసం నెల రోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు అంటూ వార్తలు రావడంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే ఓటీటీ లోకి రావడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఏంటి అన్న వివరాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే మరి. మరి థియేటర్లలో ఒక మోస్తారు కలెక్షన్లను కురిపించిన ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి మరి.